హైదరాబాద్, వెలుగు: కల్వకుంట్ల కుటుంబం కబ్జా చేసిన భూములు, ఇతర ఆస్తులను తెలంగాణలోని పేదలకు పంచాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదాన్ని విస్మరించి కేవలం కుటుంబ సంక్షేమం కోసం తన సీఎం పదవిని వాడుకున్నారని ఆరోపించారు.
ఇలాంటి వారికి రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బయటపెట్టిన కల్వకుంట్ల భూ బాగోతాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెప్పనున్నారని చనగాని దయాకర్ స్పష్టం చేశారు.
