హైదరాబాద్ సిటీ, వెలుగు: ఎంఎంసీ పరిధిలో 13 అక్రమ నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు చర్యలు చేపట్టారు. ఉప్పల్, కాప్రా, ఎల్‌బీనగర్ జోన్లలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన గదులు, షెడ్లు, అదనపు అంతస్తులను తొలగించారు.
ఉప్పల్ సర్కిల్- పరిధిలోని ప్రశాంతినగర్ కాలనీలో స్టిల్ట్ పార్కింగ్‌లో నిర్మించిన అక్రమ గదులు, రోడ్డువైపు విస్తరించిన బాల్కనీని తొలగించారు. రాంపల్లిలో కమర్షియల్షెడ్, మేడిపల్లిలో పెంట్‌హౌస్, గాయత్రి హిల్స్‌లో అక్రమ షెడ్ తొలగించారు. కాప్రా ఏఎస్‌రావునగర్‌లో స్టిల్ట్ పార్కింగ్‌లో నిర్మించిన గదులను కూలగొట్టారు. ఎల్‌బీనగర్ జోన్‌లోని లలితానగర్, గడ్డిఅన్నారం, మైత్రీనగర్ప్రాంతాల్లోనూ అక్రమంగా నిర్మించిన 3, 4వ అంతస్తులు, స్టిల్ట్ పార్కింగ్‌లోని గదులను తొలగించారు.
