పంజాగుట్ట, వెలుగు:నిమ్స్ ధవాఖానలో గురువారం జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. దీంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల పాటు వైద్య సేవలు నిలిచిపోయాయి. ముందస్తుగా చెప్పకుండా జూడాలు ధర్నా చేపట్టడంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడ్డారు. నిమ్స్‌లోని ఎమర్జెన్సీ విభాగంలోని ఓ రోగి నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా డా కె శ్రీకాంత్ బుధవారం పరిశీలించి, వివిధ పరీక్షల కోసం రెఫర్ చేశారు.
ఈక్రమంలో రోగి సహాయకుడు డాక్టర్లను అసభ్య పదజాలంతో దూషించాడు. దీనిపై సదరు డాక్టర్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిమ్స్ రెసిడెంట్ డాక్టర్లుఈ ఘటనను సీరియస్‌గా తీసుకొని ఆందోళనకు దిగారు. జూడాల ఆందోళనతో వేలాది మంది రోగులు ఇబ్బందిపడ్డారు. రెండు గంటల పాటు డాక్టర్ల కోసం వేచి ఉన్నారు.
