మెదక్ : దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి ..సిద్దిపేటలో ఆశీస్సుల దీపం కార్యక్రమం

మెదక్ : దివ్యాంగులు ఆత్మ గౌరవంతో జీవించాలి ..సిద్దిపేటలో ఆశీస్సుల దీపం కార్యక్రమం
  • మెదక్ ఎంపీ రఘునందన్ రావు 

మెదక్, వెలుగు: దివ్యాంగులు ఆత్మగౌరవంతో జీవించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. గురువారం మెదక్ కలెక్టర్ లో  ఏర్పాటు చేసిన దివ్యాంగుల సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దివ్యాంగుల కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.  6 నెలలుగా 461 మంది దివ్యాంగులను గుర్తించి వారికి 850 దివ్యాంగ సహాయ పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.  కలెక్టర్​ ప్రతిమాసింగ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్ వో అంబదాస్ రాజేశ్వర్ పాల్గొన్నారు.

సిద్దిపేట టౌన్  :   ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట వేంకటేశ్వర స్వామి ఆలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆశీస్సుల దీపం’  కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కరోనా వంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చిన ప్రధాని మోదీకి దేశ ప్రజల ఆశీస్సులే కొండంత రక్ష అని ఆయన కొనియాడారు.