జోగిపేటలో అగ్ని ప్రమాదం.. రెండు ఏటీఎంలు దగ్ధం

జోగిపేటలో అగ్ని ప్రమాదం.. రెండు ఏటీఎంలు దగ్ధం

సంగారెడ్డి జిల్లా: జోగిపేటలో గురువారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణంలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎం కేంద్రాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో రెండు ఏటీఎం మెషిన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో మంటలు మరింతగా వ్యాపించకుండా నివారించారు.

అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో నగదు లేదా ఇతర ఆస్తి నష్టం ఎంత మేరకు జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది.