హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పిల్లర్ నంబర్ 254 వద్ద మీనా హాస్పిటల్ వెనుక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అత్తాపూర్ SHO ఏ. సీతయ్య ఆధ్వర్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం.
