- కుటుంబ సభ్యుల్లో ఒకరు అటెండ్ అయితే చాలు
హైదరాబాద్, వెలుగు: సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిష్కార ప్రక్రియను ఈసీ మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఓటర్లకు అందించిన నోటీసులను పరిష్కరించేందుకు సంబంధిత ఓటర్ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరు ఈఆర్ఓ, ఎఈఆర్ఓల ఎదుట వ్యక్తిగతంగా హాజరై తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, అవసరమై సమాచారాన్నిఅందించేందుకు ఈసీ అవకాశం కల్పించిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఓటరుకు సంబంధించిన పత్రాలను స్వీకరించి జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించామని, దానికి అనుగుణంగా ఓటర్లకు ఇచ్చిని నోటీసులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఫారం -6కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, డిక్లరేషన్ ఫారం స్వీకరణ, క్లెయిమ్ ల పరిష్కార ప్రక్రియలో భాగంగా అర్హత తేదీ అక్టోబర్ ఒకటి నుంచి పరిగణిస్తూ ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న ఫారం-6 దరఖాస్తులకు, భవిష్యత్ లో అందే ఫారం-6 దరఖాస్తులకు సంబంధించి నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని సీఈఓ ఆదేశించారు.
