బీజేపీ స్టేట్ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్గా అమర్నాథ్

బీజేపీ స్టేట్ ఆల్  సెల్స్ కోఆర్డినేటర్గా అమర్నాథ్
  •  పార్టీ రాష్ట్ర విభాగానికి కీలక బాధ్యతలు అప్పగింత 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ బీజేపీ ఆల్ సెల్స్ కోఆర్డినేటర్‌‌‌‌గా హైదరాబాద్‌‌‌‌కు చెందిన డాక్టర్ అమర్‌‌‌‌నాథ్ సారంగుల నియమితులయ్యారు. బీజేపీకి అనుబంధంగా ఉన్న 23సెల్స్ కార్యక్రమాలను సమన్వయం చేయనున్నారు. కాగా, పార్టీ రాష్ట్ర విభాగానికి సంబంధించి పలు కీలక బాధ్యతలను అప్పగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు గురువారం పార్టీ రాష్ట్ర కమిటీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. రాష్ట్ర సోషల్ మీడియా ప్రభారీగా రంగారెడ్డి రూరల్‌‌‌‌కు చెందిన పోరెడ్డి కిశోర్ రెడ్డిని నియమించారు. అలాగే ఆల్ సెల్స్ జాయింట్ కోఆర్డినేటర్లుగా హైదరాబాద్‌‌‌‌కు చెందిన అట్లూరి రామకృష్ణ, నిజామాబాద్‌‌‌‌కు చెందిన పెదోళ్ల గంగారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.