చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నోట్లతో భారీగా మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నకిలీ కరెన్సీని అసలు కరెన్సీగా నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న ఆరుగురిపై 2026 నవంబర్ 24న కేసు నమోదు చేశారు. నలుగురు నిందితుల అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి 99 కట్టల చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఇప్పటికే ఆదిలాబాద్, హైదరాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో వివిధ రకాల నేరాల కేసుల నమోదయ్యాయి. ఇప్పటికే మరో కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు అరెస్టు.
ఫేక్ కరెన్సీ మోసాలపై ఆదిలాబాద్ జిల్లా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాలను వెల్లడించారు. చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లతో భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. లక్షకు, రెండు, మూడు లక్షలు ఇస్తామని ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నోట్ల కట్టలలో పైన కింది అసలైన నోట్లు ఉంచి.. లోపల నకిలీ కరెన్సీ నోట్లు పెట్టి ఇస్తారని చెప్పారు. రెండు మూడింతలు డబ్బు వస్తుందని ఆశపడి చాలా మంది మోసపోతున్నట్లు తెలిపారు. ఇలాంటి కరెన్సీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
