మంచిర్యాల, వెలుగు: మాదకద్రవ్యాల వినియోగం, రవాణాను పూర్తిగా అరికట్టి మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో సంబంధిత ఆఫీసర్లతో జిల్లాస్థాయి నార్కో కో-ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీలు, గ్రామాలు, పట్టణాల్లో పోస్టర్లు, ర్యాలీలు, అవగాహన సదస్సుల ద్వారా డ్రగ్స్‌పై యువతకు వివరించాలన్నారు.
జిల్లాలో ఇప్పటివరకు 8.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 152 మందిని అరెస్టు చేశామని తెలిపారు. 20 గంజాయి లైవ్ ప్లాంట్ కేసులు నమోదు చేశామని, 156 మంది అనుమానితుల లిస్టు రెడీ చేశామని డీసీపీ భాస్కర్ వివరించారు. డ్రగ్స్‌కు అలవాటుపడ్డ వారికి కౌన్సెలింగ్, పునరావాస సేవలు అందిస్తున్నామన్నారు. అనంతరం 'సే నో టు డ్రగ్స్ ఎస్ టు లైఫ్' పోస్టర్లను కలెక్టర్ రిలీజ్ చేశారు.
