ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో మరో ట్విస్ట్ .. ఏ2గా అతని సోదరుని పేరు

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో మరో ట్విస్ట్ .. ఏ2గా అతని సోదరుని పేరు

మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణిపై లైంగిక వేధింపులు, దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్  ఉదయ్ కృష్ణారెడ్డి కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అతని సోదరుడు ప్రణయ్ కృష్ణా రెడ్డి నిందితుడిగా చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏ1 గా ఉదయ్ కృష్ణారెడ్డి ఉండగా..  ఏ2 గా ప్రణయ్  కృష్ణారెడ్డి పేరును చేర్చారు పోలీసులు. సాక్ష్యాలను ట్యాంపర్ చేయడంలో ప్రణయ్ పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు.

ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం సమయంలో రాసిన సూసైడ్ నోట్ ను  ప్రణయ్ కృష్ణా రెడ్డి దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కీలక వీడియో ఆధారాలు కలిగిన  మరో ఐఫోన్ ను దాచడంలోనూ ప్రణయ్ రోల్ కీలకంగా ఉన్నట్లు భావిస్తు్న్నారు. ఈ మేరకు ఏ2 గా ప్రణయ్ ను చేర్చారు. 

ALSO READ : గ్రీన్ ట్యాంకర్ల పేరుతో నాలా మురుగు నీటి సరఫరా?

పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేలా ప్రణయ్ కృష్ణా రెడ్డి కోర్ట్ లో ముందస్తు బెయిల్ పొందటం గమనార్హం.