కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు..రీ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్.. రూ.వెయ్యి కోట్ల వరకు ఆదా

కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రాజెక్టు..రీ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్..  రూ.వెయ్యి కోట్ల వరకు ఆదా

జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కేబీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంట్రెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 2, రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌- 45, ఫిల్మ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-82, రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-12, రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-10 ప్రాంతాల్లో ఏడు ఫ్లైఓవర్లు, ఏడు అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు నిర్మించాలని అనుకోగా, వీటికి రూ.1,090 కోట్లు, భూసేకరణకు మరో రూ.800 కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ఇందులో 453 ఆస్తులు సేకరించాల్సి ఉండేది. ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ పలువురు ఆస్తుల యజమానులు భూసేకరణను వ్యతిరేకిస్తూ కోర్టులను ఆశ్రయించారు. 

టీడీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపంలో పరిహారం తీసుకునేందుకు కొందరు ముందుకు రాకపోవడంతో భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతలోనే రీ-అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రపోజల్స్  రావడంతో ల్యాండ్  అక్విజిషన్  ప్రక్రియ నిలిపేశారు.  రీ-అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కేవలం 100 లోపు ఆస్తులు మాత్రమే సేకరించేలా ప్రతిపాదనలున్నాయి. రీ-అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో భూసేకరణకు రూ.800 కోట్లకు బదులుగా రూ.100 కోట్లలోపు మాత్రమే అయ్యే అవకాశం ఉంది. అలాగే నిర్మాణ వ్యయంలో కూడా కొంత మేర తగ్గితే రూ. వెయ్యి కోట్ల వరకు ఆదా చేసుకునే ఛాన్స్​ ఉంది.