- ‘ఆశీర్వాద్ కా దియా’ పేరిట దీపం వెలిగించిన పొంగులేటి సుధాకర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా ఆయన దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కోసం బీజేపీ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తిరుపతి, తిరుచానూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారి సన్నిధిలో ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమంలో భాగంగా దీపం వెలిగించారు. అలిపిరి పాదాల వద్ద వినాయకస్వామి సన్నిధిలో మోదీ పేరిట ప్రత్యేక అర్చనలు చేయించారు.
దేశ ప్రగతి ప్రస్థానంలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని ప్రార్థించినట్లు పొంగులేటి తెలిపారు. మోదీకి ఆయుష్షు, ఆరోగ్యం, శక్తిసామర్థ్యాలను ప్రసాదించి నిరంతరం
దేశసేవలో నడిపించాలని భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు. 2047 నాటికి భారత్ ‘వికసిత్ భారత్’గా రూపుదిద్దుకోవాలన్న ఆకాంక్ష సాకారం కావాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
