ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లాటరీ పేరుతో రూ.7.47 లక్షలు స్వాహా.. చేవెళ్ల మండలంలో ఘటన

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ లాటరీ పేరుతో రూ.7.47 లక్షలు స్వాహా.. చేవెళ్ల మండలంలో ఘటన

చేవెళ్ల, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో లాటరీ గెలిచారని నమ్మించి దుండగుడు ఓ వ్యక్తి వద్ద రూ.7,47,468 కాజేశాడు. చేవెళ్ల మండలం తంగడిపల్లి రెవెన్యూ పరిధిలోని మడికట్టుకు చెందిన దేవరి మల్లేశంకు గత జులై 10న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. తాము కేరళ లాటరీ ఆఫీస్​నుంచి మాట్లాడుతున్నామని.. మీకు రూ.8 లక్షల లాటరీ తగిలిందని నమ్మబలికాడు. ఆ డబ్బులు కావాలంటే బ్యాంక్​అకౌంట్, ఆధార్ కార్డు వివరాలు పంపాలనడంతో వాట్సాప్ చేశాడు. 

అనంతరం కేరళ బ్యాంక్ ప్రాసెసింగ్ ట్యాక్స్, ఇతర రాష్ట్రానికి నగదు బదిలీ చార్జీలు, జీఎస్టీ, ఎన్​వోసీ, కోర్టు అగ్రిమెంట్ పేపర్, నెఫ్ట్ చార్జీలు, టీడీఎస్, ఈ–-స్టాంప్ పేపర్ పేరుతో పదేపదే డబ్బులు అడగడంతో విడతల వారీగా  రూ.7,47,468 పంపాడు. 

తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు జులై 31న సైబర్ క్రైం హెల్ప్‌‌‌‌‌‌‌‌లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. సంబంధిత రశీదును జారీ చేయగా.. గురువారం  చేవెళ్ల పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌లో అందజేశాడు.