కీసర, వెలుగు: కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కీసర గ్రామంలో వినాయకుడి లడ్డూ చోరీ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. పోచమ్మ ఆలయ మండపంలో లడ్డూ ఎత్తుకెళ్లారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్‌చేశారు. అయితే, విచారణ సమయంలో ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి తమను కొట్టారని, లాకప్‌లో ఇబ్బంది పెట్టారని బాధితులు ఆరోపించారు. చివరికి పోలీసులు ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి, గురువారం సీఆర్పీసీ నోటీసులు ఇచ్చి పంపించారు.
గాయత్రి హిల్స్‌లో హుండీ..
జూబ్లీహిల్స్: గణేశ్మండపంలోని హుండీ చోరీకి గురైన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాయత్రి హిల్స్ రోడ్ నంబర్ 10 సీలో జరిగింది. శ్రీ గణనాథ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన హుండీలో భక్తులు కానుకలు సమర్పిస్తున్నారు.
అయితే, ఈ నెల 16న ఉదయం ఆ హుండీ కనిపించలేదు. నిర్వాహకుడు ఎడుమల శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించారు. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హుండీని ఎత్తుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. హుండీలో సుమారు రూ.5 వేలు ఉన్నట్లు శ్రీనివాస్తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
