సెప్టెంబర్ 24న హైదరాబాద్‌‌లో ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమిట్’

సెప్టెంబర్ 24న హైదరాబాద్‌‌లో ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమిట్’
  • హాజరుకానున్న మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: మహానగరమైన హైదరాబాద్‌‌ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కానుంది. ప్రముఖ హెల్త్‌‌కేర్ పరిశోధన సంస్థ ‘హెల్త్‌‌ ఆర్క్’ఆధ్వర్యంలో ఈ నెల 24న ‘రైజ్ హెల్త్ ఇన్నోవేషన్ సమిట్–2026’అత్యంత వైభవంగా జరగనుంది. గ్లోబల్ హెల్త్‌‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సుకు హాజరుకానున్నాయి. 

ఈ సదస్సుకు ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు ‘ఇన్వెస్ట్ తెలంగాణ’సీఈవో అజిత్ రెడ్డి పాల్గొని.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించనున్నారు. సదస్సులో భాగంగా ‘ఇండియాస్ జీసీసీ అపర్చునిటీ’పేరిట హెల్త్‌‌ఆర్క్ రూపొందించిన ప్రత్యేక పుస్తకాన్ని అతిథులు ఆవిష్కరించనున్నారు.