టెక్బాల్లో ఇండియా ఓటమి

టెక్బాల్లో ఇండియా ఓటమి

నగోయా: ఆసియా క్రీడల టెక్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ పోటీల్లో ఇండియాకు నిరాశ ఎదురైంది. శుక్రవారం జరిగిన మెన్స్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌–బి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో డెక్లాన్‌‌‌‌‌‌‌‌ గొన్‌‌‌‌‌‌‌‌సాల్వెస్‌‌‌‌‌‌‌‌–మహ్మద్‌‌‌‌‌‌‌‌ అనాస్‌‌‌‌‌‌‌‌ ఇమ్రాన్‌‌‌‌‌‌‌‌ బేగ్‌‌‌‌‌‌‌‌ ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లోనూ ఓడారు. ఫలితంగా పతకం రేసు నుంచి నిష్క్రమించారు.

తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ట్రూంగ్‌‌‌‌‌‌‌‌ గియాంగ్‌‌‌‌‌‌‌‌ బా–అన్‌‌‌‌‌‌‌‌ ఖోవాలే (వియత్నాం) 12–10, 12–8తో ఇండియాపై గెలిచారు. ఆ తర్వాత సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా ప్లేయర్లు జున్స్‌‌‌‌‌‌‌‌క్‌‌‌‌‌‌‌‌ లీ–తైబీన్‌‌‌‌‌‌‌‌ లీ జంట 12–4, 12–7తో డెక్లాన్‌‌‌‌‌‌‌‌, అనాస్‌‌‌‌‌‌‌‌ను ఓడించారు. ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌, టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ కలబోతగా ఉండే టెక్‌‌‌‌‌‌‌‌బాల్‌‌‌‌‌‌‌‌ క్రీడను ఆసియా క్రీడల్లో తొలిసారి ప్రవేశపెట్టారు. అనాస్‌‌‌‌‌‌‌‌ బేగ్‌‌‌‌‌‌‌‌.. మిక్స్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ డబుల్స్‌‌‌‌‌‌‌‌ విభాగంలో పోటీపడనున్నాడు.