మయామీ: అర్జెంటీనా ఫుట్‌బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీ మరో ఘనత సాధించాడు. ఇంటర్ మయామీ తరఫున వంద గోల్స్ సాధించిన తొలి ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన కాంపియోన్స్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఇంటర్ మయామీ 2–0 తేడాతో క్రజ్ అజుల్‌పై గెలిచింది. మ్యాచ్ 24వ నిమిషంలో లూయిస్ సువారెజ్ అందించిన పాస్‌ను మెస్సీ అద్భుతమైన హెడర్‌గా మలిచాడు.
ఓవరాల్‌గా మెస్సీ115 మ్యాచ్‌ల్లో ఈ ఫీట్ అందుకున్నాడు. 2023లో మయామీ తరఫున అరంగేట్రం చేసిన మెస్సీ.. తొలి గోల్‌ను కూడా క్రజ్ అజుల్‌పైనే చేయడం విశేషం. మ్యాచ్ 81వ నిమిషంలో మెస్సీ అందించిన కార్నర్ కిక్‌ను కసిమిరో హెడర్‌తో గోల్‌గా మలిచి మయామీ ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. క్రజ్ అజుల్ ప్లేయర్లు గోల్స్ చేయడంలో ఫెయిల్ కావడంతో ఓటమి తప్పలేదు.
మెస్సీ వచ్చిన తర్వాత 2023లో లీగ్స్ కప్, 2024లో సపోర్టర్ షీల్డ్, 2025లో ఎంఎల్‌ఎస్ కప్‌ను సాధించిన ఇంటర్ మయామీ తాజాగా కాంపియోన్స్ కప్‌ను సొంతం చేసుకుంది. మెస్సీకి ఇది వ్యక్తిగతంగా 49వ ట్రోఫీ కావడం విశేషం.
