- ఇప్పటివరకు 51.72 మెగావాట్ల లోడ్ నమోదు
- బిల్లు రూ.8.18 కోట్లకు పైనే..
హైదరాబాద్ సిటీ, వెలుగు: టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన 9 సర్కిళ్లలో ఈ ఏడాది వినాయక మండపాల కోసం 17,348 తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు ఇచ్చింది. వీటికి ఇప్పటివరకు 51.72 మెగావాట్ల విద్యుత్ లోడ్ నమోదు కాగా.. రూ.8,18,09,482 విద్యుత్ చార్జీలు, స్థిర చార్జీల రూపంలో ఇప్పటి వరకు బిల్ నమోదైంది.
ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరించనున్నది. కాగా, వినాయక ఉత్సవాలతో పాటు నిమజ్జనోత్సవాల టైంలో నిరంతర విద్యుత్ కోసం టీజీఎస్పీడీసీఎల్ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసింది. అన్ని సర్కిళ్లలో ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలపాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది.
