వేములవాడ, వెలుగు : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయానికి శ్రావణ మాసంలో భారీ ఆదాయం సమకూరింది. 28 రోజులకు సంబంధించి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు రెండు రోజుల పాటు లెక్కించారు.
హుండీల ద్వారా మొత్తం రూ.3,72,78,809 లు వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. అలాగే 201.400 గ్రాముల మిశ్రమ బంగారం, 16.600 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు తెలిపారు. హుండీ లెక్కింపు ప్రక్రియను ఈవో రమాదేవి, దేవాదాయ శాఖ కరీంనగర్ ఏసీ కార్యాలయ పరిశీలకులు రాజమౌళి, ఆలయ డీఈవో నవీన్ కుమార్ పర్యవేక్షించారు.
