హైదరాబాద్: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు మర్డర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరిబాబును తానే చంపానని వైష్ణవి అన్న సంతోష్ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. నా చెల్లెను చంపినందుకే హరిబాబును చంపేశానని స్పష్టం చేశాడు. మా ఇంట్లో జరిగినట్లు ఏ ఇంట్లో జరగవద్దనే ఈ పని చేశానని పేర్కొన్నాడు.
తన చెల్లిని చంపిన హరిబాబును హత్య చేయడం సంతోషంగా ఉందన్నాడు. నేను పోలీసులకు లొంగిపోతున్నా. నాకు భార్య, పిల్లలు ఉన్నారు. నాకోసం అందరూ పోరాటం చేసి నాకు శిక్ష పడకుండా చూసి త్వరగా బయటకు తీసుకురావాలని సంతోష్ కోరాడు.
కాగా, గురువారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం నిజామాబాద్ ఆర్‌ఆర్ చౌరస్తాలో యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తన చెల్లి హత్యకు ప్రతీకారంగా హరిబాబును తానే చంపానని వైష్ణవి సోదరుడు సంతోష్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. హరికృష్ణను హత్య చేసిన సంతోష్ ప్రస్తుతం నిజామాబాద్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
►ALSO READ | యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబును నిజామాబాద్లో నడిరోడ్డుపై కత్తులతో పొడిచి చంపేశారు !
