కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంకరపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం (సెప్టెంబర్ 17) రాత్రి కారు నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. 

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడ్డ  ప్రవీణ్, మురళిని  కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులను నిజామాబాద్ జిల్లా విద్యుత్ శాఖ చెందిన శేఖర్, విశ్వేశ్వరరావు, పర్షిగా గుర్తించారు పోలీసులు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.