పిల్లల చదువుకు ఆకలి ఆటంకం కావద్దు..పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే : మంత్రి పొన్నం ప్రభాకర్

పిల్లల చదువుకు ఆకలి ఆటంకం కావద్దు..పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్యే : మంత్రి పొన్నం ప్రభాకర్
  • కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రారంభం

కరీంనగర్, వెలుగు : స్టూడెంట్లు ఉదయం ఆకలితో క్లాస్ లకు హాజరుకాకుండా చూడడంతో పాటు, వారికి పోషకాహారం అందించడమే స్కూల్ బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫాస్ట్ ఉద్దేశం అని పొన్నం ప్రభాకర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, హరే కృష్ణ మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఇంప్లిమెంటేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ.8 కోట్లతో కరీంనగర్ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యార్డులో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బుధవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి మంత్రి ప్రారంభించారు. 

ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పిల్లలకు ప్రభుత్వం ఇవ్వగలిగే గొప్ప ఆస్తి విద్య మాత్రమేనన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆకలితో ఉన్న స్టూడెంట్ చదువుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేడన్నారు. 

స్టూడెంట్లకు ఉదయమే పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడం ద్వారా వారి ఏకాగ్రత, తరగతి గది భాగస్వామ్యం మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు. టీచర్లకు వంట, ఆహార నిర్వహణ బాధ్యతలు లేకపోవడం వల్ల బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన సెంట్రలైడ్జ్ కిచెన్ తో ప్రతి రోజు 50 వేల మంది స్టూడెంట్లకు అల్పాహారం అందించే అవకాశం ఉందన్నారు. 

ఇక్కడి నుంచి 17 మండలాల్లోని 669 ప్రభుత్వ పాఠశాలలు, 11 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 49,025 మంది విద్యార్థులు ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్ అందుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,72,291 మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ కార్యక్రమాన్ని విస్తరించే ప్రపోజల్స్ ఉన్నాయన్నారు. అనంతరం స్టూడెంట్లకు బ్రేక్ ఫాస్ట్ వడ్డించి వారితో కలిసి అల్పాహారం చేశారు. 

తర్వాత కిచెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని వివిధ విభాగాలను పరిశీలించి వాటి పనితీరు, ఆహార తయారీ, పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు అశ్వినీ తానాజీ వాకడే, శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో షర్మిల, డీఈఓ చైతన్య జైనీ, హరే కృష్ణ మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కౌంటియా దాస స్వామీజీ, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్ పాల్గొన్నారు.