హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ ఫాంహౌస్‌పై సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడం పిరికిపంద చర్య అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫాంహౌస్ ఏమైనా నీ అబ్బ జాగీరా అని సీఎం రేవంత్‌నుద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌కు ఎవరినో యజమానులను చేస్తామని ప్రకటించడం శోచనీయమన్నారు.
బుధవారం ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడారు. నోటీసులు ఇచ్చి విచారణ జరపకపోతే అధికారులపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి స్థాయిలో బ్లాక్ మెయిల్ చేయడం సిగ్గు చేటన్నారు. కేసీఆర్ అధీనంలో 700 ఎకరాలు, కేటీఆర్, హరీశ్ రావులకు వందల ఎకరాల భూమి ఉందని సీఎం అనడం అభ్యంతరకరమన్నారు. ఏడుగురు సోదరుల భూకబ్జాల నుంచి దృష్టి మళ్లించేందుకే రేవంత్ రెడ్డి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని ఆరోపించారు.
