కోరుట్ల: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల నిరాహార దీక్ష

కోరుట్ల: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికుల నిరాహార దీక్ష

కోరుట్ల, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం రూ.10 వేలు ఇచ్చి, వారి సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు సుతారి రాములు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆర్డీవో ఆఫీస్​ముందు మధ్యాహ్న భోజనం కార్మికులు బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. పాల్గొన్న రాములు మాట్లాడుతూ.. కాంగ్రెస్​ఇచ్చిన హామీ ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులకు రూ.10 వేల జీతం అమలు చేయాలని, పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఛార్జీలు పెంచాలని డిమాండ్​చేశారు. 

పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే విధానాన్ని విరమించుకోవాలని, కార్మికులతోనే పని చేయించాలన్నారు. కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. పని భద్రత కల్పించి గుర్తింపు కార్డులు, పీఎఫ్, ఈఎస్​ఐ, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.