న్యూఢిల్లీ: లాస్ ఏంజిల్స్–2028 ఒలింపిక్స్‌లో ఎక్కువ స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) ఓ సమగ్ర ఎంపిక విధానాన్ని ప్రకటించింది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించే బాక్సర్లు.. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్కు నేరుగా అర్హత సాధించనున్నారు.
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌కు తొలి క్వాలిఫయర్ టోర్నీగా ప్రపంచ చాంపియన్‌షిప్ ఉండనుంది. దీంతో ఎక్కువ మంది బాక్సర్లు బరిలో ఉంటే ఒలింపిక్స్‌కు అర్హత సాధించే వాళ్ల సంఖ్య కూడా పెరుగుతుందని బీఎఫ్‌ఐ భావిస్తోంది.
ప్రపంచ బాక్సింగ్ సంస్థ నిబంధనలు, ఐవోసీ ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం నాలుగు దశల్లో ఎంపిక విధానం ఉంటుంది.
