చెస్ ఒలింపియాడ్లో ఇండియా బోణీ

 చెస్ ఒలింపియాడ్లో ఇండియా బోణీ

సమర్‌‌కండ్‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌): చెస్‌‌ ఒలింపియాడ్‌‌లో ఇండియా మెన్స్‌‌, విమెన్స్‌‌ జట్లు బోణీ చేశాయి. బుధవారం జరిగిన ఓపెన్‌‌ (మెన్స్‌‌) విభాగం తొలి రౌండ్‌‌లో ఇండియా 3–1తో థాయ్‌‌లాండ్‌‌పై గెలిచింది. వరల్డ్‌‌ చాంపియన్‌‌ డి. గుకేశ్‌‌.. ఫారిస్‌‌ రషీద్‌‌ అల్మియామిపై, నీహల్‌‌ సరీన్‌‌.. థనాడోల్‌‌ కుల్‌‌ప్రుయోథాన్‌‌పై, విదిత్‌‌ గుజరాతి.. తుప్‌‌ఫా ఖుమ్నోర్కావ్‌‌పై గెలవగా, తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ ఎరిగైసి.. ప్రిన్‌‌ లాహవిరపావ్‌‌ చేతిలో ఓడాడు.

దాంతో ఇండియా క్లీన్‌‌స్వీప్ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. విమెన్స్‌‌ సెక్షన్‌‌లో ఇండియా 4–0తో డొమినికన్‌‌ రిపబ్లిక్‌‌ను ఓడించింది. తెలుగు గ్రాండ్‌‌ మాస్టర్‌‌ కోనేరు హంపి.. ఫ్రాంచెస్టా రమిరెజ్‌‌ లూజన్‌‌పై, ఆర్‌‌. వైశాలి.. మిగెలినా డి లారోసాపై, వంతిక అగర్వాల్‌‌.. మేరీ లోలీ గొంజాలెజ్ పెగ్యురోపై, సవితా శ్రీ.. కార్లా మ్యానునెజ్‌‌ డియాజ్‌‌పై గెలిచారు.