బ్యూనస్ ఎయిర్స్: అర్జెంటీనా స్టార్ ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ.. మరోసారి దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇటీవలే ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీని.. అక్టోబర్ 6న బెనిన్‌తో జరిగే హోమ్ ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం అర్జెంటీనా జట్టులోకి ఎంపిక చేశారు.
బ్యూనస్ ఎయిర్స్‌లోని ప్రసిద్ధ ఎస్టాడియో మోన్యుమెంటల్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ మెస్సీకి అద్భుతమైన వీడ్కోలుగా ఉంటుందని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (ఏఎఫ్‌ఏ) ప్రెసిడెంట్ క్లాడియో టాపియా వెల్లడించాడు. అలాగే 2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా ప్లేయర్లందర్నీ తమ కుటుంబాలతో సహా ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలిపాడు. సెప్టెంబర్ 30న బొలివియాతో కొర్డోబాలో, అక్టోబర్ 3న బుర్కినా ఫాసోతో బ్యూనస్ ఎయిర్‌లో కూడా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మెస్సీ ఆడటం లేదు.
