వేములవాడ: భీమేశ్వరస్వామికి భారీ ఆదాయం

వేములవాడ: భీమేశ్వరస్వామికి భారీ ఆదాయం

వేములవాడ, వెలుగు : సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అనుబంధమైన భీమేశ్వర స్వామి ఆలయానికి హుండీల ద్వారా వచ్చిన ఆదాయ లెక్కింపును బుధవారం ప్రారంభించారు. 28 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కిస్తున్నారు. మొదటి రోజున జరిగిన లెక్కింపులో రూ.1,91,64,681 వచ్చినట్లు ఆఫీసర్లు వెల్లడించారు. 

అలాగే 119.500 గ్రాముల మిశ్రమ బంగారం, 9.800 కిలోల మిశ్రమ వెండి వచ్చినట్లు తెలిపారు. లెక్కింపును ఈవో రమాదేవి, కరీంనగర్ దేవాదాయ శాఖ ఏసీ కార్యాలయ అబ్జర్వర్ రాజమౌళి, ఆలయ డీఈవో నవీన్‌‌‌‌కుమార్ పర్యవేక్షించారు. హుండీ లెక్కింపు ప్రక్రియ గురువారం సైతం కొనసాగుతుందని ఆఫీసర్లు తెలిపారు.