హైదరాబాద్ ,వెలుగు: ప్రభుత్వంతో ఉద్యోగుల జేఏసీ నేతల చర్చలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి శుక్రవారం సీఎస్ సంజయ్ జాజుతో ఉద్యోగుల జేఏసీ చర్చలు జరపాల్సి ఉంది.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ చర్చలు సోమవారానికి వాయిదా పడినట్టు ఉద్యోగుల జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ మారం జగదీశ్వర్, ఏలూరి శ్రీనివాసరావు గురువారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, ఈహెచ్ఎస్ అమలు, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, సీపీఎస్ రద్దుతో పాటు పలు ప్రధాన సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేస్తోంది.
వాస్తవానికి ఈనెల 10న ‘చలో హైదరాబాద్’కు పిలుపునివ్వగా, సమస్యలు పరిష్కరిస్తామని సీఎస్ లిఖితపూర్వక హామీ ఇవ్వడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు నేతలు వెల్లడించారు.
