టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు వార్షిక క్యాలెండర్ ఇవ్వాలి : మల్క కొమరయ్య

టీచర్ల బదిలీలు, ప్రమోషన్లకు వార్షిక క్యాలెండర్ ఇవ్వాలి : మల్క కొమరయ్య
  •     విద్యాశాఖ సెక్రటరీకి ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని టీచర్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, ఏవీఎన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిసి వినతిపత్రం అందించారు. డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయాలని, ఏటా బదిలీలు, ప్రమోషన్ల నిర్వహణకు వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ఏ, కేజీబీవీ ఉద్యోగుల ఆర్థిక, సర్వీసు సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. 

రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక ఎదురుచూస్తున్న స్కూల్ అసిస్టెంట్లకు వెంటనే జీహెచ్ఎం, ఎంఈవో పదోన్నతులు కల్పించాలని ఎమ్మెల్సీలు కోరారు. ముందుగా జీహెచ్ఎం, ఎంఈవో పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేశాకే, సాధారణ బదిలీలు చేపట్టాలని సూచించారు. మరోవైపు చిల్డ్రన్స్ డ్రీమ్స్ కార్యక్రమంలో భాగంగా స్కూళ్లు, కాలేజీ స్థాయిలో పెయింటింగ్, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.