జనగామ, వెలుగు : జిల్లాలోని ఇంటర్ కాలేజీల్లో లెక్చరర్లు, విద్యార్థుల హాజరును ఎఫ్ఆర్ఎస్ ద్వారా నమోదు చేయాలని జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. ఈ హాజరుకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాలేజీల్లో విద్యార్థుల ప్రవేశాలు, విద్యా ప్రమాణాలు, కళాశాలల్లో అందిస్తున్న కోర్సులపై నిర్వహించిన రివ్యూలో ఆయన మాట్లాడారు.
మ్యాథ్స్‌పై విద్యార్థులకు మరింత ఆసక్తి కలిగేలా దృష్టి సారించాలని సూచించారు. కాలేజీల్లో విద్యా ప్రమాణాల మెరుగు కోసం చర్యలు తీసుకోవాలని, విద్యార్థుల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే, సీసీ కెమెరాలు ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగవని, ఇందుకోసం రూ. 1.50 కోట్లతో జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వేర్వేరు మీటింగ్‌ల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్, డీఈవో జితేందర్ రెడ్డి తదితరులున్నారు.
