జమ్మికుంట/హుజూరాబాద్/వీణవంక/శంకరపట్నం, వెలుగు: ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించుకోవాలని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సూచించారు. జమ్మికుంట పట్టణంలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాల కోసం నాయినిచెరువు వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన కార్యక్రమాన్ని సురక్షితంగా, వేగవంతంగా నిర్వహించేందుకు మూడు క్రేన్లతో నిమజ్జన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. హుజూరాబాద్ పట్టణంలోని మారుతీనగర్‌లో ఏర్పాటు చేసిన మహాగణపతిని సీపీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
వీణవంక మండలం కోర్కల్ గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించారు. అంతకుముందు శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులకు భవిష్యత్ ప్రణాళిక– లక్ష్యసాధనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి సీపీ హాజరయ్యారు. విద్యార్థులు భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో సాధించాలన్నారు.
