సియోల్: డేవిస్ కప్ క్వాలిఫయర్స్–2లో ఇండియా జట్టు కష్టాల్లో పడింది. సౌత్ కొరియాతో శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ ఇండియా ప్లేయర్లు ఓటమిపాలయ్యారు. దాంతో ఇండియా 0–2తో వెనకబడింది. తొలి సింగిల్స్‌లో దక్షిణేశ్వర్ సురేశ్ 6–3, 3–6, 4–6తో సోనోవ్ క్వాన్ చేతిలో ఓడాడు. 2 గంటలా 5 నిమిషాల మ్యాచ్‌లో తొలి సెట్‌లో అద్భుతంగా ఆడిన సురేశ్ తర్వాత రెండు సెట్లలో ప్రత్యర్థి ధాటిని తట్టుకోలేకపోయాడు.
రెండో సింగిల్స్‌లో సుమిత్ నగాల్ 6–2, 4–6, 5–7తో హ్యోన్ చుంగ్ చేతిలో కంగుతిన్నాడు. 3 గంటలా 6 నిమిషాల మ్యాచ్‌లో నగాల్ సర్వీస్‌ల్లో ఫెయిలయ్యాడు. చుంగ్ బేస్‌లైన్ ఆటతో చెలరేగాడు. శనివారం జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లో గెలిస్తేనే ఇండియా ముందంజ వేస్తుంది.
