బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్నె క్రిశాంక్ అరెస్ట్.. విడుదల

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్నె క్రిశాంక్ అరెస్ట్.. విడుదల

పద్మారావునగర్, వెలుగు: ‘ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో వివాదాస్పద పోస్టులు పెట్టిన కేసులో బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియా కన్వీనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మన్నె క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం హైడ్రామా, ఉద్రిక్తత పరిస్థితుల మధ్య సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేశారు. అయితే,  నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని హైకోర్టు ఆదేశించడం, నాంపల్లి కోర్టు కూడా రిమాండ్​రిజెక్ట్​చేయడంతో తర్వాత ఆయనకు నోటీసు ఇచ్చి పంపించారు. కొద్ది రోజుల కింద సైఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఎస్​పరిధిలో మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీఏ, పీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓలపై నమోదైన కేసు విషయంలో క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్​లో వివాదాస్పద ట్వీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్మెంట్ కు దగ్గర ఉన్న ఏసీపీ దాడికి ప్రోత్సహించారని పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీ  పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారుల సంఘం అధ్యక్షుడు ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడిపై పలు కేసులు నమోదు చేశారు. 

శుక్రవారం సికింద్రాబాద్ పికెట్ లోని క్రిశాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటికి వెళ్లి విచారణ కోసం బయటకు రావాలని కోరగా సహకరించలేదు. గేటుకు తాళాలు వేసి, తలుపులు బిగించుకోవడంతో బలవంతంగా లోపలకు వెళ్లి అదుపులోకి తీసుకుని సీసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు తరలించారు. అయితే, మరోవైపు పోలీసులు తన భర్తను ఇంట్లో నుంచి లాక్కొనిపోయారంటూ కార్కానా పీఎస్​లో క్రిశాంక్​భార్య ఫిర్యాదు చేశారు. తర్వాత క్రిశాంక్​క్​ను కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కోఠిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నోటీసులు ఇవ్వలేదనే కారణంతో నాంపల్లి కోర్టు రిమాండ్​రిజెక్ట్​చేయడం, హైకోర్టు కూడా అరెస్ట్​చేయవద్దని చెప్పడంతో విడుదల చేసి నోటీసులు ఇచ్చి పంపించారు.