తిర్యాణి: పత్తి చేనులో గంజాయి సాగు.. రైతు అరెస్ట్

తిర్యాణి: పత్తి చేనులో  గంజాయి సాగు.. రైతు అరెస్ట్

తిర్యాణి, వెలుగు: పత్తి చేనులో గంజాయి సాగుచేసిన రైతును పోలీసులు అరెస్ట్ చేశారు. కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌‌‌ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామానికి చెందిన కొడప రవి గుడిపేట శివారులోని పత్తి చేనులో గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. 

విశ్వసనీయ సమాచారం మేరకు రెబ్బెన సీఐ  సంజయ్, తిర్యాణి ఎస్సై సుబ్బారావు సిబ్బందితో కలిసి తనిఖీ చేయగా.. 30 గంజాయి మొక్కలు బయటపడ్డాయి. వాటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు.