ముకుత్బన్–గడ్చందూర్ మధ్య కొత్త లైన్కు 493 కోట్లు..

ముకుత్బన్–గడ్చందూర్ మధ్య కొత్త లైన్కు 493 కోట్లు..
  • సరుకు రవాణా, పారిశ్రామిక, మైనింగ్ అభివృద్ధికి తోడ్పడుతుందన్న రైల్వే శాఖ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రాంతీయ రైల్వే అనుసంధానాన్ని బలోపేతం చేసే దిశగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ముకుత్బన్(ఆదిలాబాద్), గడ్చందూర్ మధ్య రూ.38.21 కి.మీ కొత్త లైన్ నిర్మాణానికి రూ.493 కోట్లతో రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ కొత్త లైన్ ఏడాదికి 6.08 మిలియన్ టన్నుల సరకు రవాణా, ప్రతిరోజు ప్రతి దిశలో 2 ఎంఈఎంయూ రైళ్లకు మద్దతు ఇస్తుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది.

ముకుత్బన్, గడ్చందూర్ ప్రాంతాలు కీలకమైన పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలుగా ఉన్నాయని రైల్వే శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. అదే విధంగా  అనేక సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ కు చెందిన బొగ్గు గనులు, సమీపంలోని సున్నపురాయి గనులు ఉన్నట్లు పేర్కొంది.

కొత్త రైలు మార్గం ఈ పారిశ్రామిక సమూహాలకు రైలు అనుసంధానాన్ని బలోపేతం చేయడంతో పాటు సరుకు రవాణను మరింత సులభతరం చేస్తుందని తెలిపింది. ప్రయాణ దూరం, రవాణ సమయం, సంబంధిత ఖర్చులను సైతం తగ్గిస్తుందని వెల్లడించింది. ప్రస్తుత వార్థా–మాణిక్ ఘడ్ మార్గంలో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ మార్గాన్ని అందించనుందని స్పష్టం చేసింది.