హైదరాబాద్, వెలుగు: నీళ్ల విషయంలో ఏపీ గొంతెమ్మ కోరికలు కోరుతున్నదని తెలంగాణ పేర్కొంది. శుక్రవారం కృష్ణా ట్రిబ్యునల్లో తెలంగాణ రిజాయిండర్ వాదనలు కొనసాగాయి. ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులకు 512 టీఎంసీలు, కొత్త ప్రాజెక్టులకు 114.75 టీఎంసీలు, కట్టబోయే ప్రాజెక్టులు 176.46 టీఎంసీలు, ఔట్‌సైడ్ బేసిన్‌కు మరో 140.62 టీఎంసీల కేటాయింపులు కావాలంటూ వాదిస్తున్నదని, ఏపీ వాదనలన్నీ అసంబద్ధమని స్పష్టం చేసింది.
నీటి అవసరాలు మొత్తం 1444 టీఎంసీలన్న ఏపీవి గొంతెమ్మ కోర్కెలని ట్రిబ్యునల్‌కు తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డును మార్చొద్దన్న ఏపీ వాదనను తోసిపుచ్చింది. ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చట్టానికి విరుద్ధమన్న వాదననూ తిరస్కరించింది. ఇన్సైడ్ బేసిన్‌తో సమానంగా ఔట్‌సైడ్ బేసిన్ తరలింపులను చూడాలన్న ఏపీ వాదనలకు అర్థం లేదని స్పష్టం చేసింది. కాగా, తమవన్నీ ఇన్సైడ్ బేసిన్ ప్రాజెక్టులేనని, వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని మరోసారి తేల్చి చెప్పింది.
