పాల్వంచ, వెలుగు : వినాయక నవరాత్రులను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో వినాయక మండపాలను భారీగా అలంకరించారు. బొల్లోరుగూడెం హైస్కూల్ రోడ్డులోని ఏకదంత వినాయక మండపాన్ని శుక్రవారం రాత్రి రూ.1.5 కోట్ల నగదుతో అలంకరించారు. బాపూజీనగర్‌లో తూర్పు కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండపాన్ని రూ.కోటి నగదుతో, వెంగళరావు కాలనీలోని మండపాన్ని రూ.50 లక్షల నగదుతో అలంకరించారు. ఈ మండపాలను తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
