శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల గ్రామ శివారులో NH-44పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గణేష్ నిమజ్జనం అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు ఇన్నోవా వాహనం లో శంషాబాద్ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురికావడంతో ఒకే కుటుంబానికి చెందిన  నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను కేతావత్ లింబ్యా (54), ఆయన భార్య కేతావత్ జమున (45), కత్రావత్ మాన్సింగ్ (48), కేతావత్ వస్రామ్ (45)గా పోలీసులు గుర్తించారు.ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ సబావత్ అశోక్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను చికిత్స కోసం శంషాబాద్‌లోని ట్రైడెంట్ ఆసుపత్రికి తరలించారు.

మృతులంతా మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందినవారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.