హైదరాబాద్: మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ ఢీకొట్టడంతో యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల ప్రకారం.. దీప్సిక, అమర్దొయ శనివారం (సెప్టెంబర్ 19) రాత్రి స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ వినాయక మండపం దగ్గర అన్నదాన కార్యక్రమానికి యాక్టివ్పై వెళ్లారు. అన్నదాన కార్యక్రమం తర్వాత తిరిగి వెళ్తుండగా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం దగ్గర బైక్పై ప్రయాణిస్తోన్న వీరిని టిప్పర్ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ యువతీయువకుడు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
