ఎర్రవల్లిలో మూడో రోజు రెవెన్యూ సర్వే

ఎర్రవల్లిలో మూడో రోజు రెవెన్యూ సర్వే

సిద్దిపేట జిల్లా: ఎర్రవల్లిలో రెవెన్యూ అధికారుల సర్వే మూడో రోజుకు చేరుకుంది. మూడు బృందాలుగా ఏర్పడిన అధికారులు సర్వే నంబర్ 325లో భూముల హద్దులు, విస్తీర్ణాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

ఇప్పటికే ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ గ్రామాల సరిహద్దులో ఉన్న సర్వే నంబర్ 325 హద్దులను అధికారులు శాటిలైట్ సాంకేతికత ద్వారా గుర్తించారు. దీంతో ఆయా భూముల సరిహద్దులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.సర్వే నంబర్ 325లోని అసైన్డ్ భూముల బౌండరీలను గుర్తించి మార్కింగ్ వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

సర్వే నంబర్ 325లోని భూమి మొత్తం విస్తీర్ణాన్ని నేడు సర్వేయర్లు గుర్తించనున్నారు. హద్దులను నిర్ధారించడంతో పాటు భూమి విస్తీర్ణాన్ని కొలిచే ప్రక్రియ చేపట్టనున్నారు. మూడు బృందాలుగా అధికారులు సర్వే కొనసాగిస్తుండటంతో సర్వే నంబర్ 325కు సంబంధించిన భూములపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.