ఆసియా గేమ్స్ 2026.. టీమిండియా క్రికెట్ క్యాంపెయిన్ షురూ: బరిలోకి శ్రేయస్, వైభవ్!

ఆసియా గేమ్స్ 2026.. టీమిండియా క్రికెట్ క్యాంపెయిన్ షురూ: బరిలోకి శ్రేయస్, వైభవ్!

Asian Games 2026: ఆసియా గేమ్స్ 2026లో పసిడి పతకమే లక్ష్యంగా టీమిండియా సమరానికి సిద్ధమైంది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరగనున్న పురుషుల క్రికెట్ టోర్నమెంట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలయ్యింది. మొత్తం 10 జట్లు పోటీపడుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లోనే బరిలోకి దిగుతుండటంతో అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

గ్రూప్ స్టేజ్ పోరు.. 6 జట్ల మధ్య యుద్ధమే: 

టోర్నమెంట్ తొలి దశలో 6 అభివృద్ధి చెందుతున్న జట్లు రెండు గ్రూప్‌లుగా విడిపోయి రౌండ్-రాబిన్ పద్ధతిలో పోటీపడతాయి. కాగా ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

* గ్రూప్ A: ఆఫ్ఘనిస్థాన్, జపాన్, నేపాల్

* గ్రూప్ B: హాంకాంగ్ చైనా, మలేషియా, ఒమన్

నేరుగా క్వార్టర్స్‌లోకి భారత్, పాకిస్థాన్: 

ర్యాంకింగ్స్ ఆధారంగా ఆసియాలోని నాలుగు ప్రధాన జట్లు– భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లీగ్ దశ ఆడకుండా నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చాయి.  

* సెప్టెంబర్ 28 (QF 1 & QF 2): భారత్ తన తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గ్రూప్- A రన్నరప్‌తో తలపడనుంది. అదే రోజు జరగబోయే మరొక క్వార్టర్ ఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు గ్రూప్ -B రన్నరప్‌తో పోటీ పడనుంది. 

* సెప్టెంబర్ 29 (QF 3 & QF 4): శ్రీలంక జట్టు గ్రూప్ -A విజేతతో, బంగ్లాదేశ్ జట్టు గ్రూప్- B విజేతతో సెమీస్ బెర్త్ కోసం పోటీ పడతాయి.

అక్టోబర్ 3న గోల్డ్ మెడల్ ఫైట్: 

నోకౌట్ రేసు పెరిగేకొద్దీ పతకాల పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

* సెమీఫైనల్స్ (అక్టోబర్ 1): క్వార్టర్స్‌లో గెలిచిన నాలుగు జట్లు సెమీస్‌లో తలపడతాయి.

* ఫైనల్ ఫైట్ (అక్టోబర్ 3): సెమీఫైనల్‌ విజేతలు పసిడి పతకం (Gold Medal) కోసం ఫైనల్ సమరంలో పోటీపడగా, ఓడిపోయిన జట్లు అదే రోజు బ్రాంజ్ మెడల్ (కాంస్య పతకం) కోసం తలపడతాయి.