మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన

మెదక్ జిల్లాలో దంచికొట్టిన వాన
  •     కొల్చారంలో అత్యధికంగా13 సెంటీమీటర్ల వర్షపాతం

మెదక్/కౌడిపల్లి, వెలుగు: మెదక్​ జిల్లా వ్యాప్తంగా గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లారే వరకు భారీ వర్షం కురిసింది.  పలుచోట్ల కుండపోత వాన పడింది. జిల్లా వ్యాప్తంగా సరాసరి 4 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 

కొల్చారంలో అత్యధికంగా13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేగోడ్ లో 7 సెంటీమీటర్లు, చిలప్ చెడ్ 6.9, కౌడిపల్లి 6.3, పాపన్నపేటలో 6.5, టేక్మాల్, తూప్రాన్ లో 5, వెల్దుర్తి 4.8, మెదక్​ 4.3, హవేలి ఘనపూర్​ 4,  చిన్నశంకరంపేట మండలంలో 3 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో ఆయా మండలాల్లో చెరువులు పూర్తిగా నిండి అలుగు పారుతున్నాయి. తూప్రాన్, వెల్దుర్తి, కొల్చారం, మెదక్ మండలాల పరిధిలోని హల్దీ వాగు జల ప్రవాహాన్ని సంతరించుకుంది. భారీ వర్షం కురవడంతో వరి పైర్లకు మేలు కలిగింది.