గ్రేటర్ సైబరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాలపై అధికారులు మరోసారి కఠిన చర్యలు చేపట్టారు. మణికొండ పంచవటి కాలనీలో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన రేకుల షెడ్డును గండిపేట తహసీల్దార్ బృందం కూల్చివేసింది. సర్వే నంబర్ 42లో సుమారు 500 గజాల ప్రభుత్వ భూమిని ఆక్రమించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ప్రభుత్వ స్థలం అని ఏర్పాటు చేసిన బోర్డును తొలగించి రేకుల షెడ్డు నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు
గండిపేట ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది, తహసీల్దార్ బృందం కలిసి ఆదివారం (ఆగస్టు 02) అక్రమ నిర్మాణాన్ని పూర్తిగా తొలగించారు. అనంతరం అక్కడ మళ్లీ ప్రభుత్వ స్థలం పేరిట బోర్డును ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా గండిపేట ఎమ్మార్వో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించబోమని, తిరిగి ఇలాంటి కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.
