హైదరాబాద్ సిటీలోని ఎల్బీనగర్ పరిధి బైరామల్ గూడలో దారుణం జరిగింది. కన్న కూతురిని చెరువులో ముంచి హత్య చేసింది ఓ కసాయి తల్లి. అభంశుభం తెలియని చిన్నారిని నీటిలో ముంచి చంపడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపుతోంది. మద్యం మత్తులో చిన్నారిని హత్య చేసినట్లు స్థానికులు,పోలీసులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే..
ఎల్బీనగర్ పరిధిలోని బైరామల్ గూడలో నివాసముంటున్న ఇంజాపూర్ కు లోకసాని రాజేశ్వరి స్థానికంగా నివాసముంటోంది. ఆదివారం ( ఆగస్టు 2) సాయంత్రం కడుపున పెట్టిన బిడ్డ 9నెలల చిన్నారి అనురాధను పక్కనే ఉన్న చెరువులో ముంచి హత్య చేసింది. చిన్నారి హత్య స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు నిందితురాలిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
►ALSO READ | బాలానగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి మృతి
ఘటన సమయంలో నిందితురాలు రాజేశ్వరి మద్య మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
