Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి వార్తలు.. వరుడు అతనేనా? కొనసాగుతున్న సస్పెన్స్!

Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి వార్తలు.. వరుడు అతనేనా? కొనసాగుతున్న సస్పెన్స్!

Pooja Hegde Marriage Rumours: ‘బుట్ట బొమ్మ’ పూజా హెగ్డే (Pooja Hegde) మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆమె సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో హాట్ టాపిక్‌గా మారారు. గత కొంతకాలంగా తన రిలేషన్‌షిప్ విషయాలను చాలా గోప్యంగా ఉంచుతున్న పూజా.. ప్రేమ, పెళ్లి విషయంలో ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. ఇప్పటికే పూజా హెగ్డే ఓ క్రికెటర్‌తో డేటింగ్‌లో ఉన్నారంటూ కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఓ బాలీవుడ్ నటుడితో ఆమె రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వార్తలపై పూజా ఎలాంటి అనౌన్స్ చేయలేదు.

తాజాగా పూజా హెగ్డే పెళ్లికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉంది? పూజా హెగ్డే వివాహం గురించి వస్తున్న వార్తల వెనుక అసలు విషయం ఏంటి? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరి వివరాలేంటో ఓ లుక్కేద్దాం..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

‘బుట్ట బొమ్మ’ పెళ్ళికి గ్రీన్ సిగ్నల్!

హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లికి సిద్ధమయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు చూసిన వ్యక్తితో అరేంజ్డ్ మ్యారేజ్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వరుడు సినీ రంగానికి చెందినవారా? లేక వ్యాపారవేత్తనా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ పెళ్లి వార్తలపై ఇప్పటివరకు పూజా హెగ్డే లేదా ఆమె కుటుంబ సభ్యుల నుంచి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఇది నిజమా? లేక కేవలం రూమరా? అన్నది తెలియాల్సి ఉంది. ఫ్యాన్స్ మాత్రం బుట్టబొమ్మ రియాక్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pooja Hegde (@hegdepooja)

ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే, 

పూజా చేతిలో భారీ ప్రాజెక్టులు.. వ్యక్తిగత జీవితం పక్కన పెడితే, వృత్తిపరంగా పూజ ప్రస్తుతం టాప్ గేర్‌లో ఉంది. గతేడాది 2025లో బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన దేవా (Deva), రెట్రో, కూలీ (స్పెషల్ సాంగ్) వంటి సినిమాల్లో నటించింది. అలాగే, 2026లో వరుణ్ ధావన్ హీరోగా, డేవిడ్ ధావన్ దర్శకత్వంలో హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai) చిత్రంలోనూ నటించి ఆకట్టుకుంది. రీసెంట్ గా తమిళ సూపర్ స్టార్ విజయ్ సరసన జన నాయగన్ (Jana Nayagan) నటించింది మెప్పించింది. ఇక ఈ 35 ఏళ్ల బ్యూటీ ప్ర‌స్తుతం దుల్కర్ సల్మాన్‌తో తెరకెక్కుతున్న ‘శ్రీ శ్రీ’ చిత్రంలో, రాఘవ లారెన్స్ సరసన ‘కాంచన-4’ న‌టిస్తోంది.