రూ.50 కోట్ల క్లబ్‌‌ లో చెన్నై లవ్‌‌స్టోరీ 

రూ.50 కోట్ల క్లబ్‌‌ లో చెన్నై లవ్‌‌స్టోరీ 

కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియ జంటగా నటించిన  ‘చెన్నై లవ్ స్టోరీ’  బాక్సాఫీస్ వద్ద 50 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి విజయవంతంగా దూసుకెళ్తోంది.  హార్ట్ టచింగ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్న ఈ సినిమా విజయోత్సవాన్ని శనివారం  హైదరాబాద్‌‌లో  నిర్వహించారు.  ఈ సందర్భంగా కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘థియేటర్లలో ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి వస్తున్న అద్భుత స్పందన ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.  

సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు సంతోషంగా ఉండటమే అసలైన విజయం.  ఈ విజయానికి నిర్మాతల అంకితభావమే ప్రధాన కారణం.  ప్రేక్షకులు మరింత లాంగ్ రన్ అందిస్తారని భావిస్తున్నాం’ అని అన్నాడు. మంచి కంటెంట్‌‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే విషయం మరోసారి ప్రూవ్ అయ్యిందని శ్రీగౌరీ ప్రియ చెప్పింది.  

తొలి చిత్రానికే ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులు, నిర్మాతలు, నటీనటులకు  దర్శకుడు  రవి నంబూరి థ్యాంక్స్ చెప్పాడు. విడుదలైన కొద్ది రోజుల్లోనే కిరణ్ కెరీర్‌‌లో ఈ చిత్రం అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలవడం ఆనందంగా ఉందని నిర్మాత ఎస్‌‌కేఎన్ అన్నారు.  కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని సహా టీమ్ అంతా పాల్గొన్నారు.