ఉద్యోగుల తరహాలోనే ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు

ఉద్యోగుల తరహాలోనే ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ బకాయిలు
  • విడతల వారీగా చెల్లింపుకు సర్కారు కసరత్తు
  • కొత్త బకాయిల భారం రాకుండా ఇక నుంచి డీబీటీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏండ్లకొద్దీ పేరుకుపోయి విద్యాసంస్థలను, విద్యార్థులను వేధిస్తున్న ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెండింగ్ బకాయిల చెల్లింపునకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేసింది. ప్రతి నెలా ఉద్యోగుల జీతభత్యాల మాదిరిగానే షెడ్యూల్ ప్రకారం క్రమం తప్పకుండా విడతల వారీగా ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బకాయిలను విడుదల చేయాలని భావిస్తోంది.

గత ప్రభుత్వ హయాం నుంచి పేరుకుపోతూ వచ్చిన దాదాపు రూ. 8 వేల కోట్ల భారీ బకాయిల భారాన్ని వాయిదాల పద్ధతిలో క్లియర్​ చేసేందుకు  కసరత్తు చేస్తోంది. మరోవైపు, ఇకపై కొత్తగా బకాయిలు పేరుకుపోకుండా నిరోధించేందుకు ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పథకంలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫర్ (డీబీటీ) విధానాన్ని అమలు చేయనున్నది.

ఈ క్రమంలో త్వరలోనే తొలివిడత నిధులను విడుదల చేసేందుకు  ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. కాలేజీలు విద్యార్థుల ఆధార్​ అథెంటికేషన్​ పూర్తి చేసిన అప్లికేషన్లకు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​అందనుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పద్ధతుల తరహాలోనే రాష్ట్రంలోనూ డీబీటీ సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వర్తింపజేయడం ద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసి నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకే డబ్బు జమ చేయనున్నారు.

విడతల వారీగా రూ. 8 వేల కోట్ల బకాయిలు చెల్లింపు
గత కొన్నేండ్లుగా రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో పెండింగ్​ భారీగా పెరిగిపోయింది. గత ప్రభుత్వం సమయానికి రిలీజ్​ చేయకపోవడంతో ఈ సమస్య తలెత్తింది.  దాదాపు రూ. 8 వేల కోట్లకు చేరడంతో కాలేజీల యాజమాన్యాలు, బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిడి వ్యక్తమవుతున్నది. ఈ పరిస్థితులపై దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం, ఉద్యోగుల పెండింగ్​ బెనిఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగే ప్రతి నెలా బడ్జెట్ నుంచి నిర్ణీత మొత్తాన్ని కేటాయిస్తూ విడతలవారీగా పెండింగ్ బకాయిలను చెల్లించే ప్రతిపాదనను సిద్ధం చేస్తున్నది.    

కేంద్రం తరహాలో డీబీటీ విధానం.. 
 కేంద్రంలో అమల్లో ఉన్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్  తరహాలోనే రాష్ట్రంలోనూ డీబీటీ నిబంధనలను సవరిస్తామని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. కేంద్ర ప్రభుత్వ 60:40 నిధుల భాగస్వామ్య నమూనాను అనుసరిస్తూ జీవో నెంబర్​ 7లో పారదర్శక సాంకేతిక మార్పులు చేస్తామని స్పష్టం చేసింది. 

ముఖ్యంగా, విద్యార్థుల అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డబ్బులు పడగానే అవి వేరే అవసరాలకు దారిమళ్లకుండా ఆటో డెబిట్, ఈ-రూపీ వోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నేరుగా సంబంధిత విద్యాసంస్థ ఖాతాకే చేరే నిబంధన తీసుకురానున్నది. విద్యార్థి డీబీటీ నిధులను కాలేజీకి బదిలీ చేయడంలో విఫలమైతే,  తదుపరి విడతల నిధులు నిలిపివేసేలా రికవరీ రూల్స్ తీసుకురానున్నది.

కేంద్ర పద్ధతి ప్రకారం విద్యా సంవత్సరంలో మొత్తం ఫీజు, మెయింటెనెన్స్ అలవెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రెండు ప్రధాన విడతల్లో  విద్యార్థుల ఆధార్ లింక్డ్ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు. మొదటి విడత నిధులను అకడమిక్ ఇయర్ ప్రారంభంలో కోర్సు అలవెన్స్ రూపంలో, రెండో విడతను సెమిస్టర్, కోర్సు సగం పూర్తయ్యాక ట్యూషన్ ఫీజు కాంపోనెంట్ కింద అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో క్రెడిట్ చేస్తారు. ఇదే తరహా సిస్టమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వర్తింపజేస్తూ సాంకేతిక చిక్కులు లేని పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది.

3 నుంచి 4 విడతల్లో డీబీటీ
ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఒకేసారి కాకుండా ఏడాదికి 3 విడతల్లో (క్వార్టర్లీ,  సెమిస్టర్​) విద్యార్థుల ఖాతాల్లో క్రెడిట్ చేయాలని భావిస్తున్నారు. విద్యా సంవత్సరం మొదట్లో మొదటి వాయిదా చెల్లిస్తారు.. ఈ సారి ఇది వారం, పది రోజుల్లోనే జమ చేయనున్నారు.

సెమిస్టర్ పరీక్షల సమయంలో మిగిలిన విడతల చొప్పున నిధులు వేస్తే విద్యార్థులు ఆ నిధులను వెంటవెంటనే కాలేజీలకు ట్యూషన్ ఫీజుల రూపంలో చెల్లించడానికి వీలుంటుంది.  డీబీటీ అమలుతోపాటు పాత బకాయిల విడుదల ప్రక్రియ సమాంతరంగా సాగడంతో రీయింబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్​ బకాయిల బాధ ఉండదని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు