పాకిస్థాన్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో శాంతి ర్యాలీని లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడి చేశారు. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 20 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో నలుగురు పోలీసులు ఉన్నారు. వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఆదివారం ఓ పోలీస్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.
స్వాత్ జిల్లాలోని కబల్ టౌన్ లో స్వాత్ వర్గం శాంతి ర్యాలీలో పేలుడు పదార్థాల జాకెట్ ధరించిన దుండగుడు తనను తాను పేల్చుకున్నాడు. దీంతో భయంతో స్థానికులు పరుగులు పెట్టారు. మొదట సూసైడ్ బాంబర్ ను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అదే సమయంలో దుండుగుడు బాంబును పేల్చినట్లు స్థానిక మీడియా చెబుతోంది. ఈ ఘటన ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది.
►ALSO READ | పార్లమెంటులో స్కిట్ చేసిన ఎంపీ పప్పూ యాదవ్పై కత్తితో దాడి..
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం.. ఖైబర్ పఖ్తూన్ ఖ్వా ప్రాంతంలో శాంతిని కోరుతూ స్వాత్ అమన్ జిర్గా (స్థానిక గిరిజన మండలి) నిర్వహించిన ఈ ర్యాలీలో ఈ ఘటన జరిగింది. తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఈ దాడి చేసిందని అనుమానిస్తున్నారు.
TTP కారణంగా, పాకిస్తాన్, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఉగ్రవాదులకు కాబూల్ ఆశ్రయం కల్పిస్తోందని ఇస్లామాబాద్ ఆరోపిస్తుండగా ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండించింది.
